కూలిపని చేసుకునే బండి బుచ్చిరాజు(23) ఆదివారం భార్యతో రొయ్యల కూర వండమని చెప్పాడు. కోడిగుడ్లుకూర వండడంతో భార్యతో గొడవపడి మళ్లీ బయటకు వెళ్లిపోయి రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి తిరిగివచ్చి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని పురుగుమందు తాగాడు. దీంతో అస్వస్థతకు గురికాగా పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్ కు తరలించగా వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు.