పిఠాపురం: పాదగయ ఈవోగా కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్
పిఠాపురం పాదగయ ఈవోగా కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆలయానికి వచ్చిన ఆయన కుక్కుటేశ్వర, దత్తాత్రేయ, రాజరాజేశ్వరి, పురుహుతిక దేవతా మూర్తులను దర్శించుకున్నారు. రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఈవోగా పని చేస్తున్న ఈయనకు దేవాదాయశాఖ అధికారులు అద నపు బాధ్యతలు అప్పగించారు. కాగా తుని లోవ దేవ స్థానం ఈవో విశ్వనాథరాజు 22 రోజుల క్రితం పాదగయ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు.