రాజమండ్రిలోని స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న 'అన్న క్యాంటీన్'ను గురువారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్ లోని ఫర్నిచర్, తాగునీరు, వంట గదిని పరిశీలించారు. ఎక్కడా చిన్న లోటు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్యాంటీన్లను తిరిగి పునరుద్ధరించామన్నారు.