ఆంధ్ర కేసరి ఎడ్యుకేషన్ ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులుగా క్రోవ్విడి సుబ్రహ్మణ్యం, కోసూరి చండీప్రియ ఎన్నికయ్యారని ఆంధ్ర కేసరి యువజన సమితి అధ్యక్షుడు దేశిరెడ్డి బలరాం నాయుడు తెలిపారు సోమవారం రాజమండ్రి డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా జరిగినట్టు తెలిపారు. ఉపాధ్యక్షులుగా లంక సత్యనారాయణ సహాయ కార్యదర్శిగా తొక్కుల రమేష్ కోశాధికారిగా ఎస్. ఏ. కరీంలు ఎన్నికయ్యారు.