డెల్టా కాలువలకు 8, 970 క్యూసెక్కుల నీరు విడుదల

56చూసినవారు
డెల్టా కాలువలకు 8, 970 క్యూసెక్కుల నీరు విడుదల
రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవలేశ్వరం కాటన్‌ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు ఆదివారం 8, 970 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. ఇందులో తూర్పు డెల్టాకు 2, 650, మధ్య డెల్టాకు 1, 720, పశ్చిమ డెల్టాకు 4, 600 క్యూసెక్కుల చొప్పున వదిలారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 9. 10 అడుగులుగా నమోదైనట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్