రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం సర్ అర్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఉదయం 7 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను జల వనరుల శాఖ అధికారులు సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో బ్యారేజీ వద్ద 11. 75 అడుగుల నీటిమట్టం కొనసాగుతుందన్నారు. బ్యారేజ్ నుండి 10. 12 లక్షల క్యూసెక్కుల నీరు సముద్ర జలాలలోకి విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.