ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం ఏవీ నగరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, వైద్య శాఖ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. హాస్పిటల్ అన్ని విభాగాలు క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం శృంగరక్షం గ్రామంలోను జిల్లా పరిషత్ హై స్కూల్ ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు.