ఉప్పలగుప్తం మండలంలో 60. 8 మి. మీ వర్షం

66చూసినవారు
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలంలో నేటి ఉదయం నుంచి సాయంత్రం వరకు అత్యధికంగా 60. 8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు సోమవారం సాయంత్రం తెలిపారు. అదే విధంగా జిల్లాలోని రావులపాలెం, కపిలేశ్వరపురం మండలాల్లో అత్యల్పంగా 1. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 15. 4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదయిందని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్