రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన మద్యం పాలసీకి సంబంధించి కోనసీమలో ఉన్న 133 షాపులకు గాను ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా మొత్తం 4, 087 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ ఆదివారం అమలాపురంలో తెలిపారు. ఈనెల 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమలాపురం కలెక్టరేట్లో అభ్యర్థుల సమక్షంలో కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు.