పూర్వపు నీటి వినియోగదారుల సంఘాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి మంగళవారం హాజరయ్యారు. ఈ మేరకు నేటి వినియోగదారుల సంఘాల పునరుద్ధరణకు చేపట్టవలసిన కార్యాచరణపై సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు.