ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అమలాపురం కలెక్టరేట్ ముట్టడించారు. సోమవారం ధర్నా నిర్వహించిన ఆశా కార్యకర్తలు తమ సమస్యలు నెరవేర్చాలని సీఐటీయూ నాయకురాలు కృష్ణవేణి ఆధ్వర్యంలో కలెక్టరేట్ గేటు లోపల ప్రవేశించారు. పట్టణ సీఐ వీరబాబు సమక్షంలో పోలీసులు వరిని అడ్డుకున్నారు. అడిషనల్ డీఎంహెచ్ఐ భారత లక్ష్మితో చర్చలు జరిపారు.