మహిళల సామాజిక, ఆర్థిక సాధికారత, పిల్లల రక్షణ అభివృద్ధి కోసం తాగునీరు, మరుగుదొడ్లు, కిచెన్ గార్డెన్స్ వంటి మెరుగైన వసతులను కల్పించాలని లైన్ డిపార్ట్ మెంట్ అధికారులను కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. అమలాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన లైన్ డిపార్ట్ మెంట్ అధికారులతో వివిధ మౌలిక సదుపాయాలు సంపూర్ణ పోషణ వంటి అంశాలపై శుక్రవారం చర్చించారు. వారికి సూచనలు చేశారు.