సంక్రాంతి పండుగ నేపథ్యంలో అల్లవరం మండలంలో 12 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని ఎస్ఐ హరీష్ బుధవారం తెలిపారు. కోడి పందేలు, గుండాటలు, పేకాట నేపథ్యంలో ఈ కేసులు నమోదు చేశామన్నారు. వారిని తహసీల్దార్ నరసింహారావు ఎదుట హాజరుపరిచామని తెలిపారు. ఒక్కొక్కరికి రూ. 25 వేలు పూచికత్తుపై విడుదల చేశారన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.