అమలాపురంలో పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో బొంతు ప్రసాద్ ఇంట్లో శనివారం సాయంత్రం నాగపాము హలచల్ చేసింది. కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే ఉప్పలగుప్తం మండలం భీమనపల్లిలో ఉన్న స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకి సమాచారం అందించారు. వర్మ సంఘటన స్థలానికి చేరుకుని పాముని చాకచక్యంగా పట్టుకుని బంధించారు. వర్మను పలువురు అభినందించారు.