అమలాపురంలోని కోనసీమ పోలీస్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి 40 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. వారు తెలిపిన సమస్యలను సత్వరమే చట్టపరిధిలో పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిర్ణీత సమయంలో ఆ సమస్యలను పరిష్కరించాలని సూచించారు.