కార్మిక, జౌళి, నైపుణ్యాభివృద్ధి శాఖల పార్లమెంటరీ కమిటీ సభ్యుడైన అమలాపురం ఎంపీ గంటి హరీశ్ మాధుర్ బసవరాజ్ బొమ్మై ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న తొలి కమిటీ సమావేశానికి హాజరయ్యారు. సోమవారం పార్లమెంటులో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ హరీష్ స్పందిస్తూ ప్రతిష్ఠాత్మక పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా తొలి సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. చేనేత, జౌళి రంగాల్లో రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తానన్నారు.