అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లాలో నూతన మద్యం పాలసీ ద్వారా ఏర్పాటు చేయబోయే 133 మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి లాటరీ ప్రక్రియ ద్వారా ఎంపిక నిర్వహించనున్నట్లు కలెక్టరేట్ అధికారులు ఆదివారం తెలిపారు. కలెక్టర్ మహేష్ కుమార్ సమక్షంలో ఈ ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటల నుంచి జరుగుతుందన్నారు.