ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకంలో గృహ వినియోగదారుడు విద్యుత్ ఉత్పత్తిదారుడుగా మారే అవకాశం కలుగుతుందని జేసీ నిశాంతి తెలిపారు. అమలాపురంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ. అధిక ప్రయోజనాలు కలిగించే సూర్య ఘర్ యోజనను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని, తమకు నచ్చిన వెండర్ల ద్వారా సోలార్ గ్రూప్ టాప్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.