జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో రామానుజన్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ గణిత సదస్సులో అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు టీఎస్పీఎస్సీ సూర్య నారాయణమూర్తి పరిశోధన పత్రం సమర్పించనున్నారు. రామానుజన్ జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 22న జరగనున్న సదస్సులో పత్రం సమర్పణకు ఎస్సీఈఆర్డీ నుంచి డాక్టర్ మూర్తికి సమాచారం వచ్చినట్లు శనివారం తెలిపారు.