అమలాపురంలో మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణ రావు 9వ వర్ధంతి స్థానిక మెట్ల సత్యనారాయణ రావు స్మృతివనం వద్ద వారి తనయుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, టిడిపి నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, దాట్ల బుచ్చిరాజు, మాజీ జడ్పీ చైర్మన్ నామాన రాంబాబు, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.