3 నెలలపాటు రూ. 15 వేల పెన్షన్ ఇచ్చినట్లే ఇచ్చి సెప్టెంబర్లో రూ. 6000 మాత్రమే ఇచ్చారని అంబాజీపేట మండలం మాచవరానికి చెందిన మట్టపర్తి వీర వెంకట సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు తొలగించిన రూ. 15 వేలు పెన్షన్ తిరిగి మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రం అందజేశారు.