రుణ అర్హత కలిగిన కౌలుదారులందరికి జీవో నెంబర్ 596 ప్రకారం నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా రుణ అర్హత కార్డులను పారదర్శకంగా జారీ చేయాలని వ్యవసాయ ఉద్యాన రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో బుధవారం వివిధ శాఖల అధికారు లతో సమావేశంనిర్వహించారు. అనంతరం పొలం పిలుస్తోంది పోస్టర్ను ఆవిష్కరించారు. జెసి టి. నిశాంతి పాల్గొన్నారు.