గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి దిండి రాంబాబు, డివిజనల్ పంచాయతీ అధికారి ఏ. రాజు అధికారులకు సూచించారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని గుమ్మిలేరు గ్రామ పంచాయితీని బుధవారం వారు ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా గ్రామ సర్పంచ్ గుణ్ణం రాంబాబు వారిని సాదరంగా ఆహ్వానించారు.