అమలాపురం మున్సిపాలిటీ పారిశుధ్య విభాగం(క్లాప్)లో పని చేస్తున్న ఆటో, టిప్పర్ డ్రైవర్లు గత మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆదివారం నిరసన తెలిపారు. పెండింగ్ జీతాలను ఇచ్చి ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఆందోళన బాట పట్టిన క్లాప్ డ్రైవర్ల యూనియన్ ప్రతినిధులతో మున్సిపల్ కమిషనర్ కేవీఆర్ఆర్ రాజు చర్చించారు. వేతనాల బకాయిల చెల్లింపునకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని కోరారు.