తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజవొమ్మంగి మండలం కొండపల్లికి చెందిన వెంకటలక్ష్మి గోకవరం ఫారెస్ట్ చెకోపోస్ట్ లో పని చేస్తున్నారు. ప్రసవం నిమిత్తం గోకవరం ప్రభుత్వాసుపత్రిలో ఆపరేషన్ చేస్తుండగా ఉమ్మనీరు రక్తనాళాల్లోకి వెళ్లి గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నవమాసాలు మోసి ఆ తల్లి బిడ్డను చూడకుండానే మృతి చెందడం కలిచివేసింది.