ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామంలోని చల్లపల్లి రోడ్డులో గురువారం భారీ త్రాచుపాము హల్చల్ చేసింది. సుమారు 20 నిమిషాలపాటు ప్రధాన రహదారి పక్కన పడగ విప్పి ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేసింది. పాము రోడ్డు పక్కన పడగ విప్పి బుసలు కొట్టడంతో కొద్దిసేపు రోడ్డుకు రెండు వైపులా ప్రయాణికులు నిలిచిపోయారు. 20 నిమిషాల తర్వాత త్రాచు పాము పొదల్లోకి వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.