రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి పట్ల గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అనపర్తిలో నూతనంగా చేపడుతున్న రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వెళ్లే కెనాల్ రోడ్డు అభివృద్ధి పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అనపర్తి కెనాల్ రోడ్డు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీసం పాదాచారులు కూడా నడవలేని విధంగా ఉందన్నారు.