అనపర్తి టీటీడీ కల్యాణ మండపంలో శ్రీ శారద సంగీత కళా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా బుధవారం ప్రముఖ ప్రవచనకర్త సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనం అందర్నీ ఆకట్టుకుంది. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. త్యాగరాజు రామభక్తి అంశంపై షణ్ముఖ శర్మ ప్రసంగించారు.