అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలోని మాచరమ్మ తల్లి ఆలయంలో సత్తి దుర్గారెడ్డి పుష్పావతి దంపతుల సౌజన్యంతో తయారు చేయించిన వెండి కిరీటాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు సోమవారం మాచరమ్మ తల్లి అమ్మవారికి అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వెళ్లిన ఎమ్మెల్యే దంపతులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.