కార్యకర్త మొక్కు చెల్లించిన ఎమ్మెల్యే

81చూసినవారు
అనపర్తి శివారు కొత్తూరులోని శ్రీ దుర్గా అమ్మవారి ఆలయం, గంగాలమ్మ అమ్మవారి ఆలయాల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాల్లో 108 కొబ్బరికాయలు కొట్టి కార్యకర్త మొక్కు చెల్లించారు. గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా నల్లమిల్లి గెలిస్తే 108 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నారు. దాంట్లో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే మొక్కును తీర్చారు.

సంబంధిత పోస్ట్