ఆసుపత్రిలో శిశువు మృతి.. వైద్యులకు నోటీసులు

78చూసినవారు
ఆసుపత్రిలో శిశువు మృతి.. వైద్యులకు నోటీసులు
పి. గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 18వ తేదీన ప్రసవ సమయంలో శిశువు మృతి చెందిన ఘటనపై ఇద్దరు వైద్యులకు నోటీసులు జారీ చేశామని కోనసీమ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ కార్తీక్ శుక్రవారం తెలిపారు. ఆసుపత్రిలోని గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురి, డ్యూటీ డాక్టర్ సంధ్యా రాణిలకు నోటీసులు జారీ చేశామన్నారు. వారు ఇచ్చే సమాధానం బట్టి తదుపరి విచారణ ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్