శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాల

52చూసినవారు
శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాల
అంబాజీపేట మండలం పసుపల్లి శివారు కమింగ్ పేట ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. కొద్దిపాటి వర్షానికే శ్లాబ్ లీకై విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం సామగ్రి, విద్యార్థులు కూర్చునే బల్లలు తడిసి ముద్దవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్