పెదపూడిలో నేను బడికి పోతా కార్యక్రమం

62చూసినవారు
పెదపూడిలో నేను బడికి పోతా కార్యక్రమం
బడి బయట ఉన్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఎంఈఓ మోకా ప్రకాశ్ కోరారు. అంబాజీపేట మండలం కె. పెదపూడిలో బుధవారం నేను బడికి పోతా కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా పలువురి ఇళ్లకు వెళ్లి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పేరెంట్స్ కు అవగాహన కల్పించారు. బడి బయట ఉన్న పిల్లలను అందర్నీ ప్రభుత్వ స్కూల్స్ లో చేర్పించేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్