మామిడికుదురు: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నిజాయితీ

65చూసినవారు
మామిడికుదురు: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నిజాయితీ
మామిడికుదురు మండలం పెదపట్నంలంక జడ్పీహెచ్ పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థులు హర్షశ్రీ సాయి వినయ్, ఆనంద్ తమకు దొరికిన రూ. 1. 30 లక్షలు విలువైన బ్రాస్లెట్ ను దాన్ని పోగొట్టుకున్న రేకపల్లి బాబి అనే వ్యక్తికి అందించి తమ నిజాయితీని నిరూపించుకున్నారు. వారికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు వంతున నగదు బహుమతులను యజమాని బాబి మంగళవారం అందజేశారు. సర్పంచ్ సుందరనీడి రాజేష్, హెచ్ఎం హరినాథ్ వారిని అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్