పోషకాహార మాసోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

57చూసినవారు
గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా పోషకాహారాన్ని తీసుకోవాలని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించారు. ఈ మేరకు ఆయన మండల పరిషత్ కార్యాలయం వద్ద గురువారం ఐసీడీఎస్ అధికారులు నిర్వహించిన పోషకాహార మాసోత్సవాలలో పాల్గొని గర్భిణులకు, బాలింతలకు ప్రభుత్వం మంజూరు చేసిన పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. పలువురుకి సీమంతాలు నిర్వహించి వారిని ఆశీర్వదించారు. ఆశా సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్