Oct 27, 2024, 06:10 IST/మక్తల్
మక్తల్
అమరచింత: కురుమూర్తి స్వామికి పట్టు వస్త్రాల తయారీ ప్రారంభం
Oct 27, 2024, 06:10 IST
ఈ నెల 31 నుంచి కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమరచింత పద్మశాలీలు ఆదివారం పట్టణంలోని మార్కెట్ స్వామి దేవాలయంలో స్వామికి పట్టు వస్త్రాల తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. కురుమూర్తి స్వామికి ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాల తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.