ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీస్ శాఖ ఆంక్షలు ప్రకటించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం తాగి లేదా వేగంగా బండ్లు నడిపితే బండ్లు సీజ్ చేస్తామన్నారు. మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే రూ10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష ఉంటుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగినా, అల్లరి చేసినా కేసులు నమోదవుతాయన్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు జాగ్రత్త వహించాలని పోలీసు వారు సూచించారు.