అంబాజీపేట మండలం వాకలగరువు రావి చెట్లు వద్ద బుధవారం శ్రీఉమా పార్వతీ సోమేశ్వర స్వామి, తొండవరం శ్రీఉమా తొండేశ్వర స్వామి ప్రభలు కొలువు తీరాయి. తొండవరం గ్రామానికి చెందిన ప్రభను అత్యంత ఎత్తులో 55 అడుగులతో ఏర్పాటు చేశారు. వాకలగరువు చెందిన ప్రభను 53 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. భక్తులు ఈ ప్రభలను దర్శించుకుని ముడుపులు, మొక్కుబడులు సమర్పించారు. ఇక్కడ తీర్థ మహోత్సవం ఘనంగా జరిగింది.