ప్రభుత్వం ఆదేశాల మేరకు డిసెంబర్ 7న పాఠశాల వ్యవస్థకే అతి పెద్ద పండుగగా మెగా పేరెంట్స్ టీచర్స్ డే సమావేశం నిర్వహించనున్నామని ఎంఈఓ శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థి వికాసం, సమస్యల పరిష్కారానికి, టీచర్లు, తల్లిదండ్రుల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి ఆ సమావేశం వేదిక అవుతుందన్నారు. దీన్ని మండలంలోని ప్రతి పాఠశాలలో విజయవంతంగా నిర్వహించాలని గోపాలపురంలో శుక్రవారం జరిగిన టీచర్ల సమావేశంలో ఎంఈఓ సూచించారు.