దేవరపల్లి మండలం ఎర్నగూడెం బస్టాండ్ సెంటర్‌లో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి ముగ్గురు వ్యక్తులు బైక్‌పై అనంతపల్లి వెళుతుండగా వారిని ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వృద్ధురాలు తీవ్రంగా గాయపడగా, మిగిలిన ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్సులో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.