తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోని జగ్గంపేట గండేపల్లి కిర్లంపూడి మండలాలకి సంబంధించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ కి జగ్గంపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఆధ్వర్యంలో తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో నిత్యావసర వస్తువుల ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర హాజరయ్యారు. మొదటి నుండీ పార్టీ కోసం పనిచేస్తున్న జనసేన నాయకులు, జనసైనికుల చేతులమీదుగా నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జనసేన ఇన్ ఛార్జ్ సూర్య చంద్ర మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి ప్రజలకు ప్రభుత్వానికి వారదిగా ఉండి వార్తలు అందిస్తూ కరోనా సెకండ్ వేవ్ లో ప్రజలను చైతన్యవంతులగా చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తదేకం ఫౌండేషన్ వారి సహాకారం ద్వారా ఈ చిరు కార్యక్రమం చేపట్టడం జరిగిందని, అలాగే జనసేన 2019 ఎన్నికల్లో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని జనసైనికుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తూ మొక్కల పంపిణీ, విత్తనాలు, వివిధ కార్యక్రమాలతోపాటు ఆరోగ్య కార్యకర్తలకు శానిటైజర్లు, మాస్కులు, ఆక్సి మీటర్లు అందించడం, అలాగే సేంద్రియ వ్యవసాయం చేసేందుకు వీలైన సామాగ్రి జగ్గంపేట నియోజకవర్గ వ్యాప్తంగా 500 మంది రైతులకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేనపార్టీ సమన్వయకర్త బుదిరెడ్డి శ్రీనివాస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు అడపా వెంకట్రావు గండేపల్లి, మండల మీడియా ఎన్టీవీ సూరిబాబు, కిర్లంపూడి మండలం మీడియా అంజి బాబు, జగ్గంపేట మండలాధ్యక్షుడు పాలిశెట్టి సతీష్, కిర్లంపూడి మండలాధ్యక్షుడు ఉలిసి అయిరాజు, కోఆర్డినేటర్ బీడీల రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.