ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి: ఎస్ఐ

1089చూసినవారు
ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి: ఎస్ఐ
ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని జగ్గంపేట ఎస్ ఐ ఎస్ లక్ష్మి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి సడలించిన కర్ఫ్యూ విధి విధానాలపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు జగ్గంపేట ఎస్ ఐ ఎస్ లక్ష్మి ఆధ్వర్యంలో జగ్గంపేట మెయిన్ రోడ్ లో మాస్క్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, లేనిపక్షంలో 135 రూపాయలు ఫైన్ విధించాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం ఉదయం నిర్వహించిన తనిఖీల్లో మాస్కులు లేకుండా మోటార్ సైకిల్ పై, వాహనాల పై ప్రయాణిస్తున్న వారికి అపరాధ రుసుము విధించారు. గురువారం ఒక్కరోజు 100 మంది మాస్క్ లేకుండా తిరిగే వారినీ నిలుపుదల చేసే ఒక్కొక్కరికి 135 రూపాయల చొప్పున మొత్తం 13835 వేల రూపాయలు ఈ చలానా విధించినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, కరోనాను తరిమికొట్టాలని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్