గండేపల్లి మండలం మల్లేపల్లి శివారులో 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంక్రాంతి సందర్భంగా వివిధ ప్రాంతాల్లోని వారు స్వగ్రామాలకు తిరిగివస్తున్నారు. దీంతో హైవే రద్దీగా మారింది. అదే క్రమంలో విశాఖ వెళుతున్న ఆర్టీసీ బస్సు సడన్ బ్రేక్ కొట్టడంతో వెనుక వస్తున్న కారు బస్సును ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.