నూతన కార్యక్రమం ప్రారంభించిన జగపతినగరం సర్పంచ్...

569చూసినవారు
నూతన కార్యక్రమం ప్రారంభించిన జగపతినగరం సర్పంచ్...
కిర్లంపూడి మండలం, జగపతినగరం గ్రామ సర్పంచ్ మహేంద్రాడా శ్రీలత రాంబాబు ప్రతి ఇంటికి మన సర్పంచ్ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం సాయంత్రం ఒకటో వార్డు మెంబర్ ఆళ్ల శ్రీమన్నారాయణ మరియు టిడిపి నాయకులు కుర్ల చినబాబు, తూము కుమార్ లతో కలిసి ఒకటో వార్డు నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని అత్యవసరమైన సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి కృషి చేస్తానని, అదేవిధంగా గ్రామస్తులకు ఎటువంటి సమస్య ఉన్న పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని గ్రామ సర్పంచ్ తెలియజేశారు. ఇప్పటికే గ్రామ పంచాయతీలో నిధులు కొరత ఉన్నప్పటికీ గ్రామంలో నిత్యవసరాలకు కొరత లేకుండా చూడటానికి ఎంతో కృషి చేశారని అదే కాకుండా ఇలా మా సమస్యలను తెలుసుకోవడానికి మా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉందని గ్రామస్తులు సర్పంచ్ మరియు టిడిపి నాయకులను అభినందిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్