డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన ముద్దాయిలకు కోర్టు భారీగా జరిమానా జైలు శిక్ష విధించినట్లు జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ బుధవారం తెలిపారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పార్టీ ఆదేశాల మేరకు జగ్గంపేట డివిజన్ పరిధిలో వాహన తనిఖీలు చేపట్టగా మొత్తం 18 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడటం జరిగిందన్నారు. 13 మందికి పదివేలు చొప్పున రూ. 1. 30 లక్ష జరిమానా 5 మందికి రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.