కిర్లంపూడిలో ఫిట్ నెస్ లేని రెండు కాలేజ్ బస్సుల పై కేసు నమోదు.....

29165చూసినవారు
కిర్లంపూడిలో ఫిట్ నెస్ లేని రెండు కాలేజ్ బస్సుల పై కేసు నమోదు.....
కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామ శివారున ప్రధాన రహదారిపై పెద్దాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్. సురేష్ బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఫిట్ నెస్ లేకుండా తిరుగుతున్న రెండు కాలేజ్ బస్సుల పై కేసు బుక్ చేసినట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యాలు వాహన నిబంధనలు పాటిస్తూ బస్సులకు కావలసిన అన్ని అనుమతులను రవాణా శాఖ నుంచి పొందిన తర్వాతే బస్సులను వినియోగించాలని, నిబంధనలకు విరుద్ధంగా బస్సులు రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్కూలు బస్సులలో, ఆటోలలో పిల్లలను పరిమితికి మించి ఎక్కించరాదని అలా కాకుండా పరిమితికి మించి పిల్లలను ఎక్కిస్తే చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్