4వ వార్డులో ప్రతి ఇంటికి మన సర్పంచ్ కార్యక్రమం

4908చూసినవారు
కిర్లంపూడి మండలం, జగపతినగరం గ్రామంలో నాలుగో వార్డులో గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు వార్డు మెంబర్ సరీసే శివతో కలిసి ప్రతి ఇంటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన సమస్యల్లో పారిశుధ్యం మరియు వీధిలైట్ల ఏర్పాటు విషయమై ఏమైనా లోటుపాట్లు ఉంటే అవి తక్షణమే పరిష్కరిస్తామని సర్పంచ్ తెలియజేశారు. ప్రతి ఇంటికి తిరిగిన గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్ సరిసే శివ లకు ప్రజలు అనేక సమస్యలను విన్నవించారు. ఆ సమస్యలన్నీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని గ్రామ సర్పంచ్ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒకటి రెండు మూడు వార్డుల్లో తిరిగామని అక్కడ ప్రజలు చెప్పిన పారిశుద్ధ్య వీధిలైట్ల నిర్వహణ సమస్యలను దాదాపుగా పూర్తి చేయడం జరిగిందని సర్పంచ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు మెంబర్ ఆళ్ల శ్రీమన్నారాయణ , టిడిపి నాయకులు కార్యకర్తలు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్