శనివారం మధ్యాహ్నం 2 గంటలనుండి జగ్గంపేట లోని శ్రీ అమృత స్కూల్ లో వినాయక చవితి ని పురష్కరించుకుని మట్టి విగ్రహాల తయారీ పోటీలు, ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్కూల్ అధినేతలు శ్రీనివాస్, లోవరాజు, సంజయ్ కుమార్ విచ్చేసి విద్యార్దులును అభినందించారు. విద్యార్దులందరికీ ఉపాధ్యాయులు చేతులుమీదుగా బహుమతులు ఇచ్చారు.