ఆగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే విధంగా ఈ శాసనసభ సమావేశాలలో నిర్ణయం తీసుకోవాలని ఆగ్రీగోల్డ్ బాదితుల సంఘం రాష్ట్ర అద్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కాకినాడ గాంధీభవన్ లో ఆదివారం కాకినాడ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల ఆగ్రీగోల్డ్ బాధితుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. సంఘం జిల్లా అద్యక్షుడు రాంబాబు అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సదస్సును నిర్వహించారు.