ఆర్ టి ఏ నియమ నిబంధనలను ఉల్లంఘించి ఆర్టీసీ బస్టాండ్ వద్ద టిక్కెట్ సర్వీస్ చేస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని కాకినాడ క్యాబ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడిపూడి శ్రీనివాస్, శ్రీను, కాశి, కిరణ్ , శేఖర్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.